బాధితురాలి మాటే బ్రహ్మాస్త్రం

|

Oct 12, 2019 | 1:07 PM

అత్యాచార బాధితురాళ్ల చికిత్స విషయంలో కేరళ ఓ మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తూ ‘ ‘ ప్రోటోకాల్ ‘ ని ‘ రూపొందించింది ‘. దీన్నే రేప్ లేదా లైంగిక నేరాలకు గురైన బాధితురాళ్ళ శారీరక, మానసిక పరీక్షకు సంబంధించిన ‘ మెడికో-లీగల్ ప్రోటోకాల్ ఫర్ ఎగ్జామినేషన్-2015 ‘ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో అత్యాచారాలకు గురైన బాధితురాళ్ళలో., ముఖ్యంగా వారిలో మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడమే ఈ ప్రోటోకాల్ ఉద్దేశం. మానసికంగా వారికి సాంత్వన కలిగేలా., తమకు కలిగిన దారుణ […]

బాధితురాలి మాటే బ్రహ్మాస్త్రం
Follow us on

అత్యాచార బాధితురాళ్ల చికిత్స విషయంలో కేరళ ఓ మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తూ ‘ ‘ ప్రోటోకాల్ ‘ ని ‘ రూపొందించింది ‘. దీన్నే రేప్ లేదా లైంగిక నేరాలకు గురైన బాధితురాళ్ళ శారీరక, మానసిక పరీక్షకు సంబంధించిన ‘ మెడికో-లీగల్ ప్రోటోకాల్ ఫర్ ఎగ్జామినేషన్-2015 ‘ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో అత్యాచారాలకు గురైన బాధితురాళ్ళలో., ముఖ్యంగా వారిలో మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడమే ఈ ప్రోటోకాల్ ఉద్దేశం. మానసికంగా వారికి సాంత్వన కలిగేలా., తమకు కలిగిన దారుణ అనుభవాన్ని మరిచిపోయి.. తిరిగి సాధారణ జీవితం గడిపేలా చూడడమే ఈ ప్రోటోకాల్ ధ్యేయం.అయితే 2015 నాటి ఈ పధ్దతిని సవరిస్తూ అలాంటివారికి మరింత ధైర్యాన్ని కలిగించే ప్రయత్నానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఇది ‘ కేరళ ప్రోటోకాల్ ‘ అని అక్కడి ప్రముఖ డాక్టర్లు పేర్కొంటున్నారు. దీని ప్రకారం.. మొదట బాధితురాలి కథనాన్ని విశ్వసించండి.. ప్రపంచంలోనే దొరకని ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఆమెకు కల్పించండి.. అప్పుడు ఆమెకు శారీరక పరీక్ష అవసరమే ఉండదు అని వారు చెబుతున్నారు.
ఇప్పటివరకు బాధితురాళ్ళ ప్రయివేటు భాగాల పరీక్షను డాక్టర్లు నిర్వహిస్తూ వచ్చారు. వారు బిడియంతో, ఇందుకు విముఖత చూపినా ఇలాంటి పరీక్షలు తప్పేవి కావు. వారికి అసలు రేప్ కన్నా ఇలాంటివి మరింత మానసిక క్షోభకు గురి చేస్తూ వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ‘ సెకండ్ అసాల్ట్ ‘ గా అభివర్ణించింది. ఈ మధ్యే సుప్రీంకోర్టు ‘ పోక్సో ‘ చట్టాన్ని సవరించింది. అలాగే అత్యాచారాన్ని కూడా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేరానికి సంబంధించిన మొత్తాన్ని బాధితురాలి ప్రవర్తన, శరీరానికి అయిన గాయాలు, పైగా నేరస్థుడు అసభ్యకరంగా ఆమెను తాకాడా వంటి ఇతర అంశాలను కూడా ఈ ప్రోటోకాల్ కింద విస్తరించారు. రివైజ్ చేసిన ఈ పద్దతి ప్రకారం.. బాధితురాలి శరీరంలో ఎక్కడైనా గాయాలు లేకున్నా.. ఆమెపై అత్యాచారం జరిగిందనడానికి అవకాశం లేదని భావించరాదన్నదే..మహిళా డాక్టర్ బాధితురాళ్లను పరీక్షించవలసి ఉంటుంది. పైగా ఆమెను డాక్టర్ ఎలాంటి ప్రశ్నలూ వేయరాదు. ఆమె స్వయంగా తనకు కలిగిన దారుణాన్ని చెబుతున్నప్పుడు ఓపికగా ఎగ్జామినర్ వినాల్సిందే. అనేక సందర్భాల్లో మెడికల్ రికార్డులను సేకరించి బాధితురాళ్ళను మరింత వేధింపులకు గురి చేస్తుంటారు.దీనికి స్వస్తి చెప్పడం మంచిదని, సదరు బాధిత యువతి చెబుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రక్రియ అంతా రహస్యంగా జరగాలని నిర్దేశిస్తున్నారు. కేరళలో ఫోరెన్సిక్ మెడికల్ చీఫ్, పోలీస్ సర్జన్ కూడా అయిన డాక్టర్ పీ.బీ. గుజ్రాల్ ఇదే విషయాన్ని సూచిస్తున్నారు. బాధితురాలి శారీరక పరీక్ష చేయరాదని, 24 గంటల తరువాత ఇలాంటివి నిష్ప్రయోజనమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ళ లోపువారిపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె గానీ, ఆమె పేరెంట్స్ గానీ ఫిర్యాదు చేసినప్పుడు ‘ పోక్సో ‘ చట్టం కింద సంబంధిత డాక్టర్ వారిని వేధించిన పక్షంలో ఆయన విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని, ఈ నేరం కింద ఒక్కోసారి యావజ్జీవ జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని కేరళ లాయర్లు అంటున్నారు.

.