చంద్రబాబు స్వార్థం వల్లే కౌన్సిల్ రద్దు

| Edited By: Pardhasaradhi Peri

Jan 27, 2020 | 6:43 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీకి ఇటీవల గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పంతా తాను చేస్తూ.. ఇతరులపై నిందలేయడం చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అలవాటైందన్నారామె. ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన వెంటనే సునీత శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌లపై నిప్పులు చెరిగారు. లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సునీత ఆరోపించారు. అహంకారంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను […]

చంద్రబాబు స్వార్థం వల్లే కౌన్సిల్ రద్దు
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీకి ఇటీవల గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పంతా తాను చేస్తూ.. ఇతరులపై నిందలేయడం చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అలవాటైందన్నారామె. ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన వెంటనే సునీత శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌లపై నిప్పులు చెరిగారు.

లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సునీత ఆరోపించారు. అహంకారంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను వైసీపీ నేతల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని లోకేశ్‌కు సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు నిరూపించ లేకపోతే లోకేశ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సునీత నిలదీశారు.

ప్రాంతీయ విభేదాలు రాకూడదనే సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని సునీత అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కేవలం తన కుటుంబ స్వార్థం కోసం చూసుకోబట్టే ఈ రోజు శాసన మండలి రద్దు అయిందని ఆమె చెప్పుకొచ్చారు. రాజధాని పేరిట డ్రామాలాడుతున్న చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.