మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

|

Sep 02, 2020 | 8:08 AM

మ‌ద్యం విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. నిషేధం దిశగా అడుగులు వేయ‌డ‌మే కాకుండా, ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మ మ‌ద్యం ఏపీలోకి రాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది.

మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్
Follow us on

మ‌ద్యం విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. నిషేధం దిశగా అడుగులు వేయ‌డ‌మే కాకుండా, ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మ మ‌ద్యం ఏపీలోకి రాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ క్ర‌మంలో త‌ప్పు చేస్తే పోలీసు సిబ్బందిపై కూడా వేటు వేస్తోంది. తాజాగా కర్ణాటకలోని తుంకూర్ జిల్లా పావగడ తాలూకాలోని జాలేడు గ్రామం నుంచి అక్రమంగా ఏపీలోకి ఇద్దరు వ్యక్తులు మద్యం సరఫరా చేస్తున్నారు. వారి వద్ద నుంచి 50 వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంత‌ర్గ‌త విచారణలో లంచం విష‌యం నిజమ‌ని తేలడంతో.. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకు చెందిన ఎస్సైలు జిలాన్ బాషా, శివప్రసాద్ లతోపాటు కానిస్టేబుళ్లు మోహన్, మురళీకృష్ణలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రామ్​ మోహన్ తెలిపారు. వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు వివ‌రించారు.

 

Also Read :

 అభిమానుల మ‌ర‌ణంపై స్పందించిన ప‌వ‌న్ కళ్యాణ్

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మ‌ర‌ణం