కెమికల్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు.. ఒకరు మృతి..

| Edited By:

Jun 20, 2020 | 3:12 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. నిత్యం ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యూపీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది.

కెమికల్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు.. ఒకరు మృతి..
Follow us on

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. నిత్యం ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యూపీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు మహిళా కార్మికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని చిన్హత్‌ ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనాస్థలికి ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు బాయిలర్ పేలుడుకు గల కారణాలపై ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. గ్యాస్‌ లీక్‌ కానీ.. ఎలాంటి అగ్నిప్రమాదం కానీ జరగలేదని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని.. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సోమేన్ వర్మ తెలిపారు.