రాజీవ్ హత్యకేసు నిందితురాలు జైలులో ఆత్మహత్యాయత్నం

| Edited By:

Jul 21, 2020 | 12:59 PM

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులు నిందితురాలు నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళనాడులోని వేలురు జైలులో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది. వెంటనే..

రాజీవ్ హత్యకేసు నిందితురాలు జైలులో ఆత్మహత్యాయత్నం
Follow us on

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులు నిందితురాలు నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళనాడులోని వేలురు జైలులో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది. వెంటనే స్పందించిన జైలు అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని నళిని తరఫు న్యాయవాది పుగళేంది వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. గత కొద్ది రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పెరోల్‌పై బయటకు వచ్చి.. తన కుమార్తె వివాహం కోసం ఆరు నెలల పాటుగా బయటకు వెళ్లి.. మళ్లీ తిరిగి జైలుకు వచ్చింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని దోషిగా తేలగా.. గడిచిన 28 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమెతో పాటుగా..భర్త మురుగన్‌ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

కాగా, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని అధికారులు చెబుతున్నారు.