భార్యను చూసేందుకు ఈ-పాస్ దక్కలేదని.. ఆత్మహత్య..!

|

Jun 30, 2020 | 6:02 PM

తమిళనాడులో గర్భంతో ఉన్న భార్యను కలిసేందుకు ఈ పాస్ దొరకలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

భార్యను చూసేందుకు ఈ-పాస్ దక్కలేదని.. ఆత్మహత్య..!
Follow us on

కరోనా రాకాసి బంధాలను దూరం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబసభ్యల క్షేమ సమాచారంపై ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో గర్భంతో ఉన్న భార్యను కలిసేందుకు ఈ పాస్ దొరకలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తమిళనాడు కాంచిపురానికి చెందిన విఘ్నేశ్వరన్ కు చెన్నై తాంబరం కు చెందిన రాగినితో గతేడాది జూన్ 20న వివాహం జరిగింది. అయితే, లాక్ డౌన్ కి ముందు భార్య రాగిని గర్భం దాల్చడంతో, ఆమెను చెన్నై తాంబరంలోని అత్తాగారింటికి పంపించాడు విఘ్నేశ్వరన్. ఇదే క్రమంలో చెన్నైలోని భార్యను కలిసేందుకు వెళ్లాలనుకున్నాడు విఘ్నేశ్వరన్. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతుండడంతో నిబంధనలు కఠినం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఎలాగైనా భార్యను చూడాలనుకున్న యువకుడు, ఈ పాస్ కోసం ప్రయత్నించాడు. ఈ పాస్ దక్కకపోవడంతో వవిఘ్నేశ్వరన్ తీవ్ర మనస్థాపంతో కాంచిపురంలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, సోమవారం రాత్రి భార్య రాగినికి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. విషయం విగ్నేశ్వరన్ కు చెప్పేందుకు ఆమె తల్లింద్రులు ఎంత ప్రయత్నించిన ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో అతని స్నేహితులకు సమాచారమిచ్చారు. దీంతో అతని స్నేహితులు ఇంటికి వెళ్లి చూసేసరికి విఘ్వేశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.