విశాఖలో రెచ్చిపోయిన ఉన్మాది.. ప్రియురాలు గొంతుకోసి.. తానూ ఆత్మహత్యయత్నం..

|

Dec 02, 2020 | 12:33 PM

విశాఖ నగరంలో దారుణం జరిగింది. అనుమానం ఇద్దరి ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రేమించిన అమ్మాయి గొంతుకోసి... తనూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు ఓ ఉన్మాది.

విశాఖలో రెచ్చిపోయిన ఉన్మాది.. ప్రియురాలు గొంతుకోసి.. తానూ ఆత్మహత్యయత్నం..
Follow us on

విశాఖ నగరంలో దారుణం జరిగింది. అనుమానం ఇద్దరి ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రేమించిన అమ్మాయి గొంతుకోసి… తనూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు ఓ ఉన్మాది. సాగరతీరంలోని ఫెర్రీ రోడ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గొంతుకోయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. తరువాత తనను తాను గాయపర్చుకున్న శ్రీకాంత్‌ని కూడా ఆస్పత్రికి తరలించారు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది.