Laxmmi Bomb Trailer : అదిరిపోయిన ‘లక్ష్మీబాంబ్‌’ ట్రైలర్ !

|

Oct 09, 2020 | 3:07 PM

బాలీవుడ్‌ స్టార్ హీరో‌ అక్షయ్‌ కుమార్ నటించిన తాజా చిత్రం 'లక్ష్మీబాంబ్‌'. తెలుగులో లారెన్స్‌ కథానాయకుడుగా తెరకెక్కించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది.

Laxmmi Bomb Trailer : అదిరిపోయిన లక్ష్మీబాంబ్‌ ట్రైలర్ !
Follow us on

బాలీవుడ్‌ స్టార్ హీరో‌ అక్షయ్‌ కుమార్ నటించిన తాజా చిత్రం ‘లక్ష్మీబాంబ్‌’. తెలుగులో లారెన్స్‌ కథానాయకుడుగా  తెరకెక్కించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా ‘లక్ష్మీబాంబ్‌’ రూపొందింది. రాఘవా లారెన్సే హిందీ వెర్షన్‌కు ‌దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఓటీటీ వేదికగా నవంబరు 9న ఈ  మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం  ట్రైలర్ విడుదల చేశారు. మరోసారి తన అద్భుతమైన నటనతో అందర్నీ ఫిదా చేశారు అక్షయ్. ఈ ట్రైలర్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విభిన్న షేడ్స్‌లో అక్షయ్ చేసిన యాక్టింగ్ కట్టి పడేస్తుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్‌ ఎంటర్‌టైన్‌ హౌజ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.