ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ‘జగనన్న చేయూత’కు రేపు శ్రీకారం

|

Aug 11, 2020 | 5:05 PM

రేపు(ఆగస్ట్ 12)  ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4 7 00 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ‘జగనన్న చేయూత’కు రేపు శ్రీకారం
Follow us on

Jagananna Cheyutha Scheme Launch Tomorrow  : జగన్ సర్కార్ మరో కీలకమైన పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన కీలక హామీని అమలు చేయబోతోంది. ‘జగనన్న చేయూత’ పథకానికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రేపు(ఆగస్ట్ 12)  ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4 7 00 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా..  ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభింస్తారని తెలిపారు.

‘జగనన్న చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. ఈ నాలుగేళ్లలో ఈ పథకం అమలుకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.