స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డు… తొలిసారి 13,020 మార్కును క్రాస్ చేసిన నిఫ్టీ

|

Nov 24, 2020 | 1:55 PM

స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. సోమవారం లాభాల్లో ప్రారంభమైన సూచీ చివరివరకు అదే జోరుతో ముగించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు అదేజోష్ తో కొనసాగుతున్నాయి.

స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డు... తొలిసారి 13,020 మార్కును క్రాస్ చేసిన నిఫ్టీ
Follow us on

Nifty Holds 13k : స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. సోమవారం లాభాల్లో ప్రారంభమైన సూచీ చివరివరకు అదే జోరుతో ముగించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు అదేజోష్ తో కొనసాగుతున్నాయి. భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి.. అదే దూకుడుతో ముందుకు సాగుతున్నాయి.

సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా పెరిగి.. సరికొత్త రికార్డు స్థాయి అయిన 44,430పైకి చేరింది. నిఫ్టీ 90 పాయింట్లకుపైగా లాభంతో చరిత్రలో తొలిసారి 13,020 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ తొలిసారి 13,000 మార్కును క్రాస్ అద్భుతంగా స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. సెన్సెక్స్ 320 పాయింట్లు లాభాపడి 44,400 వద్ద ట్రేడ్ అయింది.

ఓ సమయంలో 44,458ని తాకింది. 1032 షేర్లు లాభాల్లో, 277 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 53 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్నిరంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ మొదటిసారి 13,000 మార్కును క్రాస్ చేసింది. 10,000 నుంచి13,000 మార్క్ చేరడానికి 40 నెలలు పట్టింది.