తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

|

Sep 16, 2020 | 4:32 PM

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా వల్ల అనుకున్న సమయం కన్నా ముందే... సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీని నిర్వహించాలనుకున్నా... ఇద్దరు సభ్యులకు, సిబ్బందికి పాజిటివ్‌ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా
Follow us on

Telangana Assembly Adjournment : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా వల్ల అనుకున్న సమయం కన్నా ముందే… సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీని నిర్వహించాలనుకున్నా… ఇద్దరు సభ్యులకు, సిబ్బందికి పాజిటివ్‌ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన స‌మావేశాలు నేటి వ‌ర‌కు కొన‌సాగాయి.

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన రెవెన్యూ బిల్లుతో పాటు మొత్తం 12 బిల్లుల‌పై చ‌ర్చించి స‌భ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింద‌ని స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా క‌రోనా వైర‌స్, కేంద్ర విద్యుత్ చ‌ట్టం, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి వంటి కార్య‌క్ర‌మాల‌పై చర్చించామ‌న్నారు.

ఈ ఎనిమిది రోజుల పాటు కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ స‌భ‌కు స‌హ‌క‌రించిన శాస‌న‌స‌భ స‌భ్యులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు, పోలీసు, శాస‌న‌స‌భ సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా సోకింద‌న్నారు. అన్ని పక్షాలతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ సమావేశాలను నిర్వహిస్తామని ప్రకటించారు స్పీకర్‌ పోచారం.