శివరాత్రి విశిష్టత

శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవు తుంది. మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి. ఓంకారం ఆది ప్రణవనాదం.. వేదాలన్నింటకీ తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే […]

శివరాత్రి విశిష్టత

Edited By:

Updated on: Mar 03, 2019 | 4:37 PM

శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవు తుంది. మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి.

ఓంకారం ఆది ప్రణవనాదం.. వేదాలన్నింటకీ తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీసి పలికితే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు… ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. అందుకే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివుడు ఉన్నాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హులే. పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన తిథి ఏకాదశి. ఇది నెలలో రెండుసార్లు వస్తుంది.

ఒకసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతీ అడిగిన సందర్భంలో.. శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం.. పగలంతా నియమనిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నేయి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తిచేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడు తెలిపాడు.