ఈమె ఎందరికో ఆదర్శం.. హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా తొలి మహిళ

| Edited By:

Oct 19, 2019 | 6:38 PM

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. అదీ ఇదీ అని లేదు అన్ని రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అందరికీ భిన్నంగా తన ఉద్యోగాన్ని ఎన్నుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇక బొట్టు బిళ్లల దగ్గర్నుంచి గృహోపకరణాల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. అలాగే మనకు నచ్చిన రెస్టారెంట్ ఫుడ్ కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ వేడివేడిగా కస్టమర్ కాళ్లదగ్గరకు తీసుకెళ్లే డెలివరీ […]

ఈమె ఎందరికో ఆదర్శం..  హైదరాబాద్‌లో  ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా తొలి మహిళ
Follow us on

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. అదీ ఇదీ అని లేదు అన్ని రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అందరికీ భిన్నంగా తన ఉద్యోగాన్ని ఎన్నుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇక బొట్టు బిళ్లల దగ్గర్నుంచి గృహోపకరణాల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. అలాగే మనకు నచ్చిన రెస్టారెంట్ ఫుడ్ కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ వేడివేడిగా కస్టమర్ కాళ్లదగ్గరకు తీసుకెళ్లే డెలివరీ ఏజెంట్స్ మనకు ఎంతోమంది కనిపిస్తుంటారు.

ప్రస్తుతం ఈ విధానం ఇప్పుడు మెట్రో నగరాలతో పాటు సాధారణ నగరాలకు సైతం విస్తరించింది. ఈ విధంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసే సంస్ధల్లో స్విగ్గీ ముందు వరుసలో ఉంది. ఈ సంస్ధకు చెందిన ఏజెంట్లలో దాదాపు పురుషులే కనిపిస్తారు. కానీ మొట్టమొదటిసారిగ హైదరాబాద్‌లో ఓ మహిళ స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన జననీరావు ఈ రంగాన్ని ఎంచుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందింది.

హైదరాబాద్ విల్లామేరీ కాలేజిలో సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన జననీరావు పై చదువులకు వెళ్లడానికి కొంత సమయం ఉండటంతో ఈ విధంగా ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. తాను జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నానని, ఉద్యోగాల్లో చిన్నది, పెద్దది అంటూ ఏదీ ఉండదని చెబుతోంది జననీరావు. ఆకలి తీర్చే ఉద్యోగం చేస్తున్నందుకు తనకు ఎంతో ఆనందిస్తున్నట్టుగా చెప్పింది జననీరావు. తాను ఒక మహిళగా ఫుడ్ డెలివరీ చేయడానికి భయం లేకుండా వెళ్తానని, హైదరాబాద్‌లో మహిళ రక్షణ గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చింది జననీరావు.

స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా ఉద్యోగం చేస్తున్న జననీరావు.. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎవరికి నచ్చిన రంగంలో వారు పని చేయడానికి మహిళలను బయటకు రావాలని జననీరావు పిలుపునిస్తోంది.