శ్రీరాం సాగర్‌కు జల కళ

|

Aug 17, 2020 | 11:58 PM

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున​ భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీరాం సాగర్‌కు జల కళ
Follow us on

Sriram Sagar‌ Heavy flood water .. : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున​ భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. అల్ప పీడనం ప్రభావంతో ప్రతీ ఏటా ఉండే పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏటా సెప్టెంబర్నే‌లోనే వచ్చే వరదలతో ఎస్సారెస్పీ నిండేది. కానీ ఈ సారి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుండటతంతో… ఓ నెల రోజు ముందుగానే శ్రీరామ్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. దీంతో నీటి శాతం 50 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 65 నుంచి 70 వేల క్యూసెక్కుల మేర వస్తోంది. ఈ నీటిలో మిషన్ భగీరథ అవసరాల కోసం 776 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు అంటే 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1079.20 అడుగులు 50.238 టీఎంసీ లుగా ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో జిల్లాలోని త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉదృతి కొనసాగుతోంది. రెంజల్ మండలం కందకుర్తి వద్దు మహారాష్ట్ర నుంచి గోదావరి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అక్కడ మంజీరా హరిద్రా నదులు గోదావరి మూడు నదులూ కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తాయి. మూడు నదుల కలయికతో కందకుర్తిలో జల కళ సంతరించుకుంది. అక్కడ నది మధ్యలో ఉన్న ప్రాచీన శివాలయం క్రమంగా నదిలోకి వెళ్లిపోతోంది. మొత్తానికి ఈ ఏడు ఎస్సారెస్పీ కి ముందే ఆశించిన స్థాయిలో వరదలు రావడంతో ఆరు జిల్లాల్లోని లక్షలాది రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.