ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ

| Edited By:

Mar 05, 2019 | 3:19 PM

ప్రపంచంలోనే టాప్ 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్‌లో ఉండటం గమనార్హం. ఎయిర్ విజువల్, ఎన్జీవో గ్రీన్‌పీస్‌ సంస్థలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పీఎమ్(పర్టిక్యులేట్‌ మ్యాటర్‌) 2.5 ఆధారంగా నగరాల కాలుష్యాన్ని వెల్లడించారు. 2017కుగానూ టాప్ 20లో 14 భారత నగరాలుండగా, 2018 ఏడాదికిగానూ మరో నగరం చేరి ఆ సంఖ్య 15కు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. అత్యంత కాలుష్య రాజధానులలో భారత రాజధాని ఢిల్లీ 113.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ […]

ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ
Follow us on

ప్రపంచంలోనే టాప్ 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్‌లో ఉండటం గమనార్హం. ఎయిర్ విజువల్, ఎన్జీవో గ్రీన్‌పీస్‌ సంస్థలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పీఎమ్(పర్టిక్యులేట్‌ మ్యాటర్‌) 2.5 ఆధారంగా నగరాల కాలుష్యాన్ని వెల్లడించారు.

2017కుగానూ టాప్ 20లో 14 భారత నగరాలుండగా, 2018 ఏడాదికిగానూ మరో నగరం చేరి ఆ సంఖ్య 15కు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. అత్యంత కాలుష్య రాజధానులలో భారత రాజధాని ఢిల్లీ 113.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో గురుగ్రామ్‌ (135.8) తొలి స్థానంలో నిలవగా, ఘజియాబాద్‌ (135.2) రెండో స్థానంలో ఉంది. పాక్ నగరం ఫైసలాబాద్ (130.4), ఫరీదాబాద్ (129.1), భివాడి (125.4) టాప్ స్థానాల్లో నిలిచాయి. కాలుష్యపూరిత నగరాల జాబితాలో టాప్ 5లో 4 భారత నగరాలుండగా, టాప్ 10 విషయానికొస్తే మొత్తంగా 7 భారత నగరాలు జాబితాలో ఉన్నాయి.