బ్రేకింగ్: పంటలకే కాదు ఫ్లైట్లకు మిడతల ముప్పు

|

May 29, 2020 | 6:48 PM

దేశానికి పొంచి వున్న మిడతల దాడి కేవలం వ్యవసాయానికే చేటు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మిడతల దండు దూకుడుగా వస్తే విమానాలకు ప్రమాదమేనని చెబుతోంది సివిల్ ఏవియేషన్ విభాగం. చెప్పడమే కాదు..

బ్రేకింగ్: పంటలకే కాదు ఫ్లైట్లకు మిడతల ముప్పు
Follow us on

Grasshoppers threat even to flights landing and taking off:  దేశానికి పొంచి వున్న మిడతల దాడి కేవలం వ్యవసాయానికే చేటు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మిడతల దండు దూకుడుగా వస్తే విమానాలకు ప్రమాదమేనని చెబుతోంది సివిల్ ఏవియేషన్ విభాగం. చెప్పడమే కాదు.. ఏకంగా మిడతల నుంచి విమానాలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్క్యులర్ కూడా విడుదల చేసింది.

సౌతాఫ్రికా నుంచి బయలుదేరి… పాకిస్తాన్ మీదుగా ఇండియాకు చేరాయని భావిస్తున్న మిడతలపై దేశంలో రైతాంగం వర్రీ అవుతోంది. చేతికి అంద వచ్చిన పంటలను మిడతల దండు సర్వనాశనం చేస్తుందన్నది వారి వర్రీ. అయితే మిడతల నివారణకు తగిన చర్యలకు తెలంగాణ వంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు మొదలు పెట్టాయి. హెలికాప్టర్ల ద్వారా వాటి గమనాన్ని అంఛనా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మిడతల దండు మీద పడితే పంటలకే కాదు ఫ్లైట్లకు కూడా ఇబ్బందేనని చెబుతూ ఓ సర్క్యులర్ విడుదల చేసింది కేంద్ర విమానయాన శాఖ. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మిడతల దండు ఎదురైతే విమానాలకు ముప్పు వాటిల్లుతుందని విమానయాన శాఖ చెబుతోంది. విమానయాన శాఖ ఆదేశాలతో డీజీసీఏ శుక్రవారం సాయంత్రం ఓ సర్క్యులర్ విడుదల చేసింది. మిడతల ముప్పును ఎదుర్కొనేందుకు డీజీసీఏ మార్గదర్శకాలను జారీ చేసింది. ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ సిబ్బందికి పలు బాధ్యతలను అప్పగించారు.

Read DGCA guidelines here:   DGCA CIRCULAR