కరోనా ఎఫెక్ట్ : జీహెచ్‌ఎంసీలో ఫిర్యాదులు ఇలా చేయండి…

|

Jun 22, 2020 | 8:20 PM

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బల్దియా కార్యాలయంలో..

కరోనా ఎఫెక్ట్ : జీహెచ్‌ఎంసీలో ఫిర్యాదులు ఇలా చేయండి...
Follow us on

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బల్దియా కార్యాలయంలో విజిటర్స్‌కు అనుమతించడంలేదనే విషయం తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కంప్యూట‌ర్, మొబైల్ ద్వారా “గూగుల్ మీట్‌”లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌ తెలిపారు.

ఈ నెల 23 నుంచి ‘గూగుల్ మీట్’ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వస్తుందని అన్నారు. కార్యాల‌య ప‌నిదినాల‌లో సాయంత్రం 4 నుండి 5గంట‌ల వ‌ర‌కు ‘గూగుల్ మీట్’‌లో ఫిర్యాదులను స్వీకరిస్తామని వెల్లడించారు. దీని కోసం ‘గూగుల్ మీట్’  లింక్ కొర‌కు GHMC official website:  https://meet.google.com/poj-qrex-hzh చూడాలన్నారు. ప్ర‌జ‌లు త‌మ ఇంటి వ‌ద్ద నుంచే స‌మ‌స్య‌ల‌ను జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తెచ్చేందుకు ‘గూగుల్ మీట్’‌తో స‌దుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు.