సాధారణ రోగులకు అందుబాటులో గాంధీ ఆస్పత్రి.!

|

Sep 25, 2020 | 11:12 AM

జంట నగరాల ప్రముఖ ప్రభుత్వాసుపత్రి అయిన గాంధీ జనరల్ హాస్పిటల్ డిసెంబర్ నాటికి సాధారణ రోగులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇది పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గాంధీలో డిసెంబర్ నుంచి కోవిడ్ వైద్యం అందించేందుకుగాను మెడికల్ కాలేజీ లైబ్రరీ బిల్డింగ్ లో ప్రత్యేక వార్డులు రూపొందించాలని నిర్ణయించారు. ఫ్యూమిగేషన్ తర్వాత పాత భవనంలో సాధారణ రోగులకు ఓపీ, ఐపీ మొదలైన సేవలు అందిస్తారు. ఇందుకోసం ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పద్మారావునగర్ […]

సాధారణ రోగులకు అందుబాటులో గాంధీ ఆస్పత్రి.!
Gandhi Hospital
Follow us on

జంట నగరాల ప్రముఖ ప్రభుత్వాసుపత్రి అయిన గాంధీ జనరల్ హాస్పిటల్ డిసెంబర్ నాటికి సాధారణ రోగులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇది పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గాంధీలో డిసెంబర్ నుంచి కోవిడ్ వైద్యం అందించేందుకుగాను మెడికల్ కాలేజీ లైబ్రరీ బిల్డింగ్ లో ప్రత్యేక వార్డులు రూపొందించాలని నిర్ణయించారు. ఫ్యూమిగేషన్ తర్వాత పాత భవనంలో సాధారణ రోగులకు ఓపీ, ఐపీ మొదలైన సేవలు అందిస్తారు. ఇందుకోసం ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పద్మారావునగర్ వైపు ఉన్న పాత గేటు నుంచి కోవిడ్ రోగులకు ఎంట్రీ కల్పిస్తారు.

కోవిడ్ రోగుల సంఖ్య 500 కు తగ్గిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల క్రితం DME సూపరింటెండెంట్ సహా ఇదే అంశంపై ఆయా విభాగాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కోవిడ్ సహా సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇప్పటికే 500 పడకల సామర్థ్యంతో ఐసీయూ వార్డులను ఏర్పాటు చేసి.. ఆక్సిజన్ సరఫరా పైపు లైన్ పనులు సహా ఇతర పనులు ప్రారంభించారు.