బ్రేకింగ్ న్యూస్: భువనగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మ‌ృతి.. ఆంబులెన్స్‌లో మరొకరు

|

Dec 24, 2020 | 6:51 PM

హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో దుర్మరణం పాలు కాగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆంబులెన్సులో మృతి చెందారు.

బ్రేకింగ్ న్యూస్: భువనగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మ‌ృతి.. ఆంబులెన్స్‌లో మరొకరు
Follow us on

Four killed in a road accident near Bhongir: హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. కారులో అత్యంత ఘోరంగా చిక్కుకుపోయిన మృత దేహాలను వెలికి తీయడం గగనమైంది. ఈ ఘోర ప్రమాదం స్థానికులను కలవర పరిచింది.

భువనగిరి పట్టణ శివారులో హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై కలెక్టరేట్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి వున్న నీళ్ళ ట్యాంకర్‌ను శరవేగంతో దూసుకొచ్చిన కారు ఢీకొంది. దాంతో ముగ్గురు స్పాట్‌లో దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన ఏరియాలో సుమారు కిలో మీటర్ మేర భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.

ఇదీ చదవండి: మళ్ళీ చెలరేగిన టీ.బీజేపీ అధ్యక్షుడు బండి.. పాతబస్తీపై సంచలన కామెంట్స్..

ఇదీ చదవండి: అగ్రిగోల్డ్‌కు మరో ఝలక్.. మొన్న అరెస్టులు.. ఇపుడు ఆస్తుల జప్తు

ఇదీ చదవండి: జేసీ ఇంటిపై ఎమ్మెల్యే ఫాలోవర్స్ దాడి.. తాడిపత్రిలో ముదిరిన సోషల్ మీడియా వార్

ఇదీ చదవండి: ఫెలో షిప్పుల మంజూరులో అక్రమాలు.. ఓయూ, కేయూలపై హైకోర్టులో పిల్