ఉప్పొంగుతున్న మూసీ నది

|

Jul 24, 2020 | 6:04 AM

గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మూసీ నది పరవళ్లు...

ఉప్పొంగుతున్న మూసీ నది
Follow us on

గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. వికారాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లోని చెరువులు మత్తడి దూకుతున్నాయి. పంట పొలాలు మునిగిపోయాయి. రోడ్లపై నీరు పారుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

పెద్దేముల్‌ మండల పరిధిలోని ఇందూరు గ్రామం నీట మునిగిపోయింది. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి.. ఇండ్లలోకి నీరు చేరింది. ప్రధాన రోడ్లన్నీ వాగులు, కాలువల మాదిరి మారిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంట్లో ఉన్న బియ్యం, ధాన్యంతో పాటు ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.