గొల్లవాగులో కనిపించని మత్స్యకారుల జాడ

|

Oct 26, 2020 | 3:50 PM

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం గొల్లవాగు ప్రాజెక్టులోకి నాటు పడవ ద్వారా చేపల వేటకు వెళ్లిన అయిదుగురు వ్యక్తుల్లో ఇద్దరు గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందరూ కలిసి నాటు పడవలో చేపల వేటకు వెళ్లగా ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో ప్రాజెక్టులో పడి మునిగిపోయారు. ఈత రావడంతో ముగ్గురు మాత్రం బయటపడ్డారు. ఇద్దరు […]

గొల్లవాగులో కనిపించని మత్స్యకారుల జాడ
Follow us on

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం గొల్లవాగు ప్రాజెక్టులోకి నాటు పడవ ద్వారా చేపల వేటకు వెళ్లిన అయిదుగురు వ్యక్తుల్లో ఇద్దరు గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందరూ కలిసి నాటు పడవలో చేపల వేటకు వెళ్లగా ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో ప్రాజెక్టులో పడి మునిగిపోయారు. ఈత రావడంతో ముగ్గురు మాత్రం బయటపడ్డారు. ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.