మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని హాస్ అరెస్ట్ చేసిన పోలీసులు

| Edited By:

Mar 02, 2019 | 2:52 PM

కడప జిల్లా పులివెందులలో కడప మాజీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జమ్మలమడుగు తాలుకాలోని సున్నపు రాళ్ల పల్లెలో రావాలి జగన్.. కావాలి జగన్.. ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకుని హాస్ అరెస్ట్ చేశారు. కార్యక్రమానికి వెళ్లేందుకు తనకు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు.. అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దారుణమన్నారు అవినాష్ రెడ్డి. మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. జమ్మలమడుగు నియోజక […]

మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని హాస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Follow us on

కడప జిల్లా పులివెందులలో కడప మాజీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జమ్మలమడుగు తాలుకాలోని సున్నపు రాళ్ల పల్లెలో రావాలి జగన్.. కావాలి జగన్.. ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకుని హాస్ అరెస్ట్ చేశారు. కార్యక్రమానికి వెళ్లేందుకు తనకు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు.. అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దారుణమన్నారు అవినాష్ రెడ్డి. మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. జమ్మలమడుగు నియోజక వర్గ ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు అవినాష్ రెడ్డి. అవసరమైతే హైకోర్టుకు తెలియజేసి అన్ని ప్రాంతాల్లో పర్యటించి వైసీపీని గెలిపించుకుంటామన్నారు. పులివెందులకు ఆదినారాయణ రెడ్డి ఎన్నోసార్లు వచ్చినా.. తాము అడ్డుకోలేదన్నారు అవినాష్ రెడ్డి.