బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 2:23 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంటోంది వైరస్. ఇక పలువురు రాజకీయ నాయకులపై కూడా కోవిడ్ ప్రభావం చూపిస్తోంది. తాజగా.. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా(79)కు...

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంటోంది వైరస్. ఇక పలువురు రాజకీయ నాయకులపై కూడా కోవిడ్ ప్రభావం చూపిస్తోంది. తాజగా.. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా(79)కు కరోనా పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనికి వైరస్ సోకిందని నిర్థారణ అయింది. వెంటనే మాజీ సీఎం శంకర్ సింగ్ గాంధీనగర్‌లో తన ఇంటిలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరోగ్యపై ఆరా తీశారు.

కాగా శంకర్ వాఘేలా 1996 నుంచి 97 వరకు సీఎంగా పని చేశారు. ఎన్సీపీ మాజీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన సేవలు అందించారు. బాపుగా అక్కడి ప్రజలకు ఆయన సుపరిచితులు. కాగా గుజరాత్‌లో ఇప్పటికే వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటివరకూ అక్కడ 30,709 కేసులు నమోదవ్వగా.. 1789 మంది మరణించారు.

Read More: 

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..