కరోనాకు ఎక్కడైనా చికిత్స ఒకటే: మంత్రి ఈటెల

| Edited By:

Sep 06, 2020 | 6:08 PM

ప్రపంచంలో ఎక్కడైనా కరోనా చికిత్స ఒకటేనని, అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులను ఖర్చు చేసుకోవద్దని

కరోనాకు ఎక్కడైనా చికిత్స ఒకటే: మంత్రి ఈటెల
Follow us on

Etela Rajender video conference: ప్రపంచంలో ఎక్కడైనా కరోనా చికిత్స ఒకటేనని, అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులను ఖర్చు చేసుకోవద్దని మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించి ప్రాణాలను కాపాడాలని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు రాజేందర్ పిలుపునిచ్చారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లో కరోనా సోకిన వ్యక్తులను మొదటి రోజే గుర్తిస్తే.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు వారి ప్రాణాలను కాపాడగలమని ఆయన అన్నారు.

ఇలాంటి వ్యాధులను ప్రజల భాగస్వామ్యంతోనే ఎదుర్కోగలమని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారని మంత్రి గుర్తు చేశారు. కొన్ని సీజనల్ వ్యాధులు, కరోనా లక్షణాలు ఒకటే ఉన్నందున సాధ్యమైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ర్యాపిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా.. వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల వేతనాల పెంపుపై సీఎంతో చర్చిస్తామని ఈటెల హామీ ఇచ్చారు.

Read More:

పూజా హెగ్డే ‘నో’ చెప్తే.. లైన్‌లో రకుల్‌!

ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రి దందా.. స్పందించిన ప్రధాని ఆఫీస్‌