అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ ఎంట్రెన్స్ డే ఫిక్స్..

కరోనా ప్రభావంతో విద్యా సంవత్సరం కాస్త ముందుకు జరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ)-2020 ఎంట్రెన్స్ టెస్ట్ జులై 12న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షను ఏప్రిల్‌ 19న జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇక అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 25వ తేదీ వరకు మరో అవకాశం కల్పించారు. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు […]

అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ ఎంట్రెన్స్ డే ఫిక్స్..

Edited By:

Updated on: May 18, 2020 | 3:51 PM

కరోనా ప్రభావంతో విద్యా సంవత్సరం కాస్త ముందుకు జరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ)-2020 ఎంట్రెన్స్ టెస్ట్ జులై 12న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షను ఏప్రిల్‌ 19న జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇక అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 25వ తేదీ వరకు మరో అవకాశం కల్పించారు.

మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు నిర్వహించాల్సి డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలను జూన్‌ 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం 040-23680240/241/291 లేదా www.braouonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని యూనివర్సిటీ అధికారుల ఓ ప్రకటనలో తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us