కవితకు మళ్ళీ నిరాశ… ఎన్నిక వాయిదా

|

May 22, 2020 | 7:27 PM

కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే మిగిలింది. గెలుపు లాంఛనమే అనుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దాంతో టీఆర్ఎస్ వర్గాల్లో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.

కవితకు మళ్ళీ నిరాశ... ఎన్నిక వాయిదా
Follow us on

Disappointing news for KCR’s daughter, former member of parliament Kalvakuntla Kavitha: కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే మిగిలింది. గెలుపు లాంఛనమే అనుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలో జరగాల్సిన నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 45 రోజుల పాటు ఈ ఉప ఎన్నికను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

లాక్ డౌన్ నేపథ్యంలో ఇదివరకు ఒకసారి నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరో సారి వాయిదా పడింది. ఈ ఉప ఎన్నిక మరో 45 రోజులు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్. దీనితో ఆగస్ట్ మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. సో.. అప్పటి దాకా కవితకు ఎదురు చూపులు తప్పవని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో ఆమెకు నిరాశే మిగిలిందని అంటున్నారు.