మారుతి కూతురు హియాకు హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ప్రశంసలు…

|

Jun 05, 2020 | 5:05 PM

హియా తీసిన ఓ ఫోటోకు పెద్ద ఎత్తున లైక్స్‌, అభినందనలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా హియాకు ఇన్‌స్టాగ్రామ్ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హియా ఇస్టాలో పెట్టిన ఫోటోను లైక్ చేసి అభినందించారు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్. అంతే కాదు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రశంసించారు.

మారుతి కూతురు హియాకు హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ప్రశంసలు...
Follow us on

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి చక్క‌ని వినోదాన్ని జోడించి చిత్రాలు తెర‌కెక్కించి సక్సెస్‌తో దూసుకుపోతున్న యువ దర్శకుడు మారుతి. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే సక్సెస్‌ను అందుకుంటూ ప్రశంసలను పొందటంలో మారుతిని మించిపోతోంది అతని కూతురు హియా.

తాజాగా హియా తీసిన ఓ ఫోటోకు పెద్ద ఎత్తున లైక్స్‌, అభినందనలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా హియాకు ఇన్‌స్టాగ్రామ్ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హియా ఇస్టాలో పెట్టిన ఫోటోను లైక్ చేసి అభినందించారు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్.

అంతే కాదు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రశంసించారు. హియా ఈ ఫోటోలను సోనీ ఏ6600 కెమెరాతో గాడ్ ఎక్స్ ఫ్లాష్ ఉపయోగించి తీస్తుంటారు. హియా తీసిని అద్భుతమైన ఫోటోలకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అంతేకాదు నటనలో మంచి ప్రదర్శన కనబరిచింది. మారుతీ డైరెక్ట్ చేసిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా చెల్లెలుగా నటించి మెప్పించింది. హియా చదువుతోపాటు డాన్స్, కెమెరాఫోగ్రఫీ, డ్రాయింగ్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుంటోంది.