ట్రస్టుల పేరుతో కార్పొరేట్ విద్యావ్యాపారం

| Edited By:

Apr 24, 2019 | 10:37 AM

23 పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 23 కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. 23 మంది తల్లులు ఆక్రందిస్తూ నేల మీద పొర్లాడుతున్నారు. ఎవరి చేతికి నెత్తురు అంటింది. మనం పన్నులు కట్టి మేపుతున్న అధికారులను ఏమీ అనలేం. వారు దైవాంశ సంభూతులు. కార్పోరేట్ కాలేజీలు ఇచ్చే రెండవ వేతనాన్ని లెక్కబెట్టడానికే వారికి సమయం సరిపోదు. వారి దృష్టిలో ఇది చాలా చిన్న పొరపాటు. ఈ మరణాలు కేవలం అపోహ మాత్రమే.  23 మంది పిల్లల ప్రాణాలు తీసే పనికిమాలిన […]

ట్రస్టుల పేరుతో కార్పొరేట్ విద్యావ్యాపారం
Follow us on
  • 23 పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
  • 23 కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి.
  • 23 మంది తల్లులు ఆక్రందిస్తూ నేల మీద పొర్లాడుతున్నారు.
  • ఎవరి చేతికి నెత్తురు అంటింది.

మనం పన్నులు కట్టి మేపుతున్న అధికారులను ఏమీ అనలేం. వారు దైవాంశ సంభూతులు. కార్పోరేట్ కాలేజీలు ఇచ్చే రెండవ వేతనాన్ని లెక్కబెట్టడానికే వారికి సమయం సరిపోదు. వారి దృష్టిలో ఇది చాలా చిన్న పొరపాటు. ఈ మరణాలు కేవలం అపోహ మాత్రమే.  23 మంది పిల్లల ప్రాణాలు తీసే పనికిమాలిన వ్యవస్థను మీడియా ప్రశ్నించలేకపోవడం దురదృష్టం. ర్యాంకుల కోసం ఆరాటపడే కుళ్లిన వ్యవస్థను ప్రశ్నిద్దాం. నిర్వీర్యమైపోయిన ఉద్యోగ వ్యవస్థను ప్రశ్నిద్దాం. అవినీతితో కుళ్ళిపోయిన విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తే..రాజకీయ నాయకులకు కార్పోరేట్ కాలేజీల నుంచి నల్లధనం సరఫరా తగ్గుతుంది. కానీ దేశం బాగుపడుతుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అవకతవకలపై టీవీ9 సీఈవో రవిప్రకాష్ గారి విశ్లేషణ.