Shocking news: కాంగ్రెస్ నేతకు కరోనా

|

May 22, 2020 | 5:24 PM

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేతకు శుక్రవారం కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆయన నిత్యం విలేకరులతోను, మీడియా సిబ్బందితోను ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తి కావడంతో పార్టీ వర్గాలతోపాటు మీడియా సంస్థల్లోను అలజడి మొదలైంది...

Shocking news: కాంగ్రెస్ నేతకు కరోనా
Follow us on

Senior Congress leader diagnosed with corona-virus positive:  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేతకు శుక్రవారం కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆయన నిత్యం విలేకరులతోను, మీడియా సిబ్బందితోను ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తి కావడంతో పార్టీ వర్గాలతోపాటు మీడియా సంస్థల్లోను అలజడి మొదలైంది. కరోనా మహమ్మారి మహారాష్ట్రాను, మరీ ముఖ్యంగా ముంబయ్ నగరాన్ని వణికిస్తున్న తరుణంలో ఆ మహానగరంలోనే కాంగ్రెస్ నేతలకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సంజయ్‌ ఝాకు కరోనా వైరస్ పాజిటీవ్‌గా తేలింది. ఈ విషయాన్న ఝా స్వయంగా మే 22న శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ‘‘ఇంతవరకు నాలో కరోనా లక్షణాలు ఏవి కనిపించలేదు. అయినా నాకు కరోనా పాజిటీవ్‌ అని తేలింది. రాబోయే 10-12 రోజులు నేను హోం క్వారంటైన్‌లో ఉండబోతున్నాను. కరోనా వ్యాప్తి లక్షణాలను తక్కువగా అంచనా వేయకండి. మనందరికి కరోనా ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి’’ అని సంజయ్‌ ఝా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనకు కరోనా సోకినట్లు సంజయ్ ఝా ట్విీట్ చేసిన కాసేపటికే పలువురు రాజకీయ నాయకులు అదే ట్విట్టర్ వేదికగా స్పందించారు. పలువురు కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ‌ నాయకులు సంజయ్‌ ఝా త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ రీట్వీట్‌ చేశారు.