ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం

| Edited By:

Mar 05, 2019 | 4:49 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీతో తాము పొత్తుపెట్టుకోవడం లేదని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ పేర్కొన్నారు. కాగా రాహుల్‌తో భేటీ కంటే ముందే ఢిల్లీ కాంగ్రెస్ నేతలంతా దీక్షిత్ నివాసంలో సమావేశమై, ఆమ్ ఆద్మీతో పొత్తుపై చర్చలు జరిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇరు పార్టీలకు సమాన ఓటు బ్యాంకులు ఉన్నందున పొత్తు పెట్టుకోరాదని వారంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి క్లీన్ […]

ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం
Follow us on

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీతో తాము పొత్తుపెట్టుకోవడం లేదని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ పేర్కొన్నారు. కాగా రాహుల్‌తో భేటీ కంటే ముందే ఢిల్లీ కాంగ్రెస్ నేతలంతా దీక్షిత్ నివాసంలో సమావేశమై, ఆమ్ ఆద్మీతో పొత్తుపై చర్చలు జరిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇరు పార్టీలకు సమాన ఓటు బ్యాంకులు ఉన్నందున పొత్తు పెట్టుకోరాదని వారంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి క్లీన్ స్వీప్ చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తుపెట్టుకుంటాయంటూ ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తాజా ప్రకటనతో ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టినట్టైంది.