పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టపడకూడదు: సీఎం జగన్‌

| Edited By:

Jul 24, 2020 | 2:36 PM

పండించిన పంటను అమ్ముకునేందుకు ఏ రైతు కష్టపడకూడదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై‌ జగన్ ఇవాళ సమీక్ష జరిపారు.

పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టపడకూడదు: సీఎం జగన్‌
Follow us on

పండించిన పంటను అమ్ముకునేందుకు ఏ రైతు కష్టపడకూడదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై‌ జగన్ ఇవాళ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వచ్చే సీజన్ కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ”అరటి, చీనీ, టమోటా రైతులు గిట్టుబాటు ధర రాక ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నారు. వారి ప్రయోజనాలను కాపాడాలంటే ఎంత మేర కొనుగోలు చేయాలి, ఎంత మేర ఫుడ్‌ ప్రాసెసింగ్‌కి తరలించాలన్న విషయంపై అధికారులు దృష్టిపెట్టాలి” అని సీఎం వెల్లడించారు. ఇందు కోసం ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు కానీ.. సమస్యకు పరిష్కారం ఉండాలని సీఎం సూచించారు.

మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌పై కూడా దృష్టి పెట్టాలని.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ప్రముఖ కంపెనీలతో టై అప్‌ చేసుకోవాలని ఆయన అన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న 7–8 పంటలను గుర్తించి.. వాటిని ప్రాసెసింగ్‌ చేసి, వాల్యూ ఎడిషన్‌కి ఏం చేయగలమో ఆలోచించాలని పేర్కొన్నారు. ఆ పంటలు ప్రాసెసింగ్‌ చేయడానికి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తనకు నివేదిక ఇవ్వాలని, నెలరోజుల్లోగా దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తికావాలని జగన్ ఆదేశించారు