మిడతల దండును ఎదుర్కొనేందుకు ప్రత్యేక కమిటీ

|

May 28, 2020 | 7:11 PM

తెలంగాణ వైపు వాయు వేగంగా దూసుకొస్తున్న మిడతల దండు దాడిని అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీ వేసింది రాష్ట్ర సర్కార్. ఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతితో కమిటీని నియమించింది. ఈ కమిటీ […]

మిడతల దండును ఎదుర్కొనేందుకు ప్రత్యేక కమిటీ
Follow us on

తెలంగాణ వైపు వాయు వేగంగా దూసుకొస్తున్న మిడతల దండు దాడిని అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది.
మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీ వేసింది రాష్ట్ర సర్కార్. ఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతితో కమిటీని నియమించింది. ఈ కమిటీ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేయనుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని పరిశీలిస్తారు. మిడతల దండు సమీపంలోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు.
మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం కేసీఆర్ అదేశించారు.