పొగాకు రైతుల సంక్షేమం దిశ‌గా సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

|

Jun 18, 2020 | 4:33 PM

పొగాకు రైతుల సంక్షోమం కోసం కీల‌క నిర్ణ‌యం దిశ‌గా ఏపీ స‌ర్కార్ అడుగులు వేస్తోంది. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. పొగాకు రైతుల‌ను ఆదుకునేందుకు..మార్కెటింగ్ శాఖ ద్వారా ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు.

పొగాకు రైతుల సంక్షేమం దిశ‌గా సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!
Follow us on

పొగాకు రైతుల సంక్షోమం కోసం కీల‌క నిర్ణ‌యం దిశ‌గా ఏపీ స‌ర్కార్ అడుగులు వేస్తోంది. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. పొగాకు రైతుల‌ను ఆదుకునేందుకు..మార్కెటింగ్ శాఖ ద్వారా ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఓ ఐఏఎస్ ఆఫిస‌ర్ నేతృత్వంలో రెండు, మూడురోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసేందుకు సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌లో భాగంగా పొగాకు పంట‌కు కనీస ధరలు ప్రకటించి, ధరల ప‌ట్టిక‌ను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో ఉంచనుంది.

పొగాకు పంట‌ వేలంలో లైసెన్స్‌ ఉన్న పొగాకు వ్యాపారులు, కంపెనీలు తప్పనిసరిగా పాల్గొనేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. లేకుంటే స‌ద‌రు కంపెనీలు, వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేయనున్నారు. వేలం జరిగే అన్ని రోజుల్లోనూ వ్యాపారులు కొనుగోళ్లలో పాల్గొనడంతో పాటు ప్ర‌భుత్వం నిర్దేశించిన టార్గెట్ మేర కొనుగోళ్లు జరిపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జగన్ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.