పది రోజుల క్రితమే అప్రమత్తం చేసినా…

| Edited By:

Apr 21, 2019 | 7:32 PM

ఈస్టర్‌ వేళ శ్రీలంకలో చోటు చేసుకున్న దారుణ కాండకు సంబంధించి పోలీసులు పదిరోజుల క్రితమే అప్రమత్తం చేశారు. ఆత్మాహుతి దాడి చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని ఏప్రిల్‌ 11న శ్రీలంకకు పోలీసు ప్రధానాధికారి పుజుత్‌ జయసుందరకు సమాచారం అందింది. దీంతో ఆయన ఇంటెలిజెన్స్‌ వర్గాలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు అదే రోజు ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఆయన సమావేశం కూడా జరిపారని ఓ జాతీయ మీడియా తెలిపింది. ‘నేషనల్‌ తోహీత్‌ జమాత్‌(ఎన్‌టీజే)’ అనే సంస్థ దేశంలో ఆత్మాహుతి దాడి […]

పది రోజుల క్రితమే అప్రమత్తం చేసినా...
Follow us on

ఈస్టర్‌ వేళ శ్రీలంకలో చోటు చేసుకున్న దారుణ కాండకు సంబంధించి పోలీసులు పదిరోజుల క్రితమే అప్రమత్తం చేశారు. ఆత్మాహుతి దాడి చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని ఏప్రిల్‌ 11న శ్రీలంకకు పోలీసు ప్రధానాధికారి పుజుత్‌ జయసుందరకు సమాచారం అందింది. దీంతో ఆయన ఇంటెలిజెన్స్‌ వర్గాలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు అదే రోజు ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఆయన సమావేశం కూడా జరిపారని ఓ జాతీయ మీడియా తెలిపింది.

‘నేషనల్‌ తోహీత్‌ జమాత్‌(ఎన్‌టీజే)’ అనే సంస్థ దేశంలో ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్రణాళిక చేస్తోందని విదేశీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. వివిధ చర్చిలతో పాటు కొలంబోలోని ఇండియన్‌ హై కమిషన్‌ను కూడా ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది’ అని పుజుత్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు చెప్పినట్లు మీడియా పేర్కొంది. ఎన్‌టీజే అనేది శ్రీలంకలోని ముస్లిం బృందం. గతేడాది శ్రీలంక వ్యాప్తంగా ఉన్న బుద్ధ విగ్రహాలను కొన్నింటిని కూల్చివేయడంతో ఇది వార్తల్లోకి ఎక్కింది. ఆదివారం ఉదయం వివిధ హోటళ్లను, చర్చిలను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 165 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.