సల్మాన్ ఖాన్ భావోద్వేగ సందేశం

|

Sep 25, 2020 | 9:06 AM

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలంటూ మొదటిసారి స్పందించారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. బాలు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ‘బాలా సుబ్రమణ్యం సార్.. మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మారాలి.. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు. మీ దిల్ దీవానా హీరో ప్రేమ్. లవ్ యు, సర్.’ అంటూ సల్మాన్ తనదైన […]

సల్మాన్ ఖాన్ భావోద్వేగ సందేశం
Follow us on

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలంటూ మొదటిసారి స్పందించారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. బాలు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ‘బాలా సుబ్రమణ్యం సార్.. మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మారాలి.. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు. మీ దిల్ దీవానా హీరో ప్రేమ్. లవ్ యు, సర్.’ అంటూ సల్మాన్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 1989 లో వచ్చిన ‘మైనే ప్యార్ కియా’ లో సల్మాన్ ఖాన్ పాత్ర పేరు ప్రేమ్

కాగా, సల్మాన్ కు బాలుతో ప్రత్యేక అనుబంధం ఉంది. 90వ దశకంలో సల్మాన్ ఖాన్ సినిమా పాటలను చాలా వరకు బాలు చేత పాడించేవారు. తుమ్సే మిల్నే కి తమన్నా హై, కబీ తు చాలియా లగ్తా హై, పెహ్లా పెహ్లా ప్యార్ హై, దిల్ దీవానా ఇంకా.. సాథియా ట్యూన్ క్యా కియా వంటి సాంగ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే.