Breaking news: హైదరాబాద్‌ సమీపంలో భారీ పేలుడు

హైదరాబాద్ నగరానికి సమీపంలోని ఐడీఏ బొల్లారంలో భారీ పేలుడు సంభవించింది. ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో పలువురు...

Breaking news:   హైదరాబాద్‌ సమీపంలో భారీ పేలుడు

Updated on: May 21, 2020 | 7:16 PM

Big fire accident in a factory near to Hyderabad city:  హైదరాబాద్ నగరానికి సమీపంలోని ఐడీఏ బొల్లారంలో భారీ పేలుడు సంభవించింది. ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తాజా సమాచారం. సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జిన్నారం మండలంలోని ఐడిఎ బొల్లారంలోని పీఎన్ఎం లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు.

రియాక్టర్ పేలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక దళం వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us