అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

|

Sep 29, 2020 | 4:41 PM

బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా తెలంగాణ ప్ర‌భుత్వం పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తుంద‌ని రాష్ర్ట ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలోని అక్కాచెల్లెళ్ల‌కు ఆయన ముంద‌స్తుగా బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్టోబ‌ర్ 9 నుంచి ఉచితంగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌బోతున్నామ‌ని చెప్పారు.  17వ తేదీ నుంచి బ‌తుక‌మ్మ సంబరం ప్రారంభం కాబోతోంది.. క‌రోనా దృష్ట్యా చీర‌ల‌ను మ‌హిళ‌ల ఇళ్ల వ‌ద్దే ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. మ‌హిళా సంఘాలు చీర‌ల‌ను పంపిణీ […]

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
Follow us on

బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా తెలంగాణ ప్ర‌భుత్వం పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తుంద‌ని రాష్ర్ట ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలోని అక్కాచెల్లెళ్ల‌కు ఆయన ముంద‌స్తుగా బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్టోబ‌ర్ 9 నుంచి ఉచితంగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌బోతున్నామ‌ని చెప్పారు.  17వ తేదీ నుంచి బ‌తుక‌మ్మ సంబరం ప్రారంభం కాబోతోంది.. క‌రోనా దృష్ట్యా చీర‌ల‌ను మ‌హిళ‌ల ఇళ్ల వ‌ద్దే ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. మ‌హిళా సంఘాలు చీర‌ల‌ను పంపిణీ చేస్తాయ‌ని తెలిపారు. కాగా, ఈ ఏడాది 287 డిజైన్ల‌తో బతుకమ్మ చీర‌ల‌ను త‌యారు చేయించారు. రూ. 317.81 కోట్ల వ్య‌యంతో కోటికి పైగా బతుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. బేగంపేట హ‌రిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లో మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు.

నేత‌న్న‌ల క‌ష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుస‌ని ఈ సందర్భంలో కేటీఆర్ అన్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత సీఎం కేసీఆర్ అన్ని వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని శాశ్వ‌త ప‌రిష్కారాల కోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు. నేత‌న్న‌ల‌కు ప‌ని క‌ల్పించి వారికి ఆదాయం పెంచాల‌ని సీఎం భావించారు.. రాష్ర్టం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లోనే 1200 కోట్ల రూపాయాల బ‌డ్జెట్‌ను చేనేత జౌళి శాఖ‌కు కేటాయించారని తెలిపారు. ప‌వ‌ర్ లూమ్స్‌కు చేతి నిండా ప‌ని క‌ల్పిస్తున్నామ‌న్నారు. ప్ర‌తి ఏడాది కోటి చీర‌లు త‌యారు చేయాల‌ని సీఎం ఆదేశించారని కేటీఆర్ చెప్పారు. ప్ర‌భుత్వ‌ స్కూల్ యూనిఫాం కూడా ప‌వ‌ర్ లూమ్స్ ద్వారానే ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని తెలిపారు. అంగ‌న్‌వాడీలు, ఇత‌ర ఐసీడీఎస్ సిబ్బందికి చెందిన చీర‌లు, కేసీఆర్ కిట్‌లో ఇచ్చే చీర‌ల‌ను కూడా ప‌వ‌ర్ లూమ్స్ ద్వారానే ఉత్ప‌త్తి అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. బ‌తుక‌మ్మ పండుగ‌కే కాదు, రంజాన్‌, క్రిస్మ‌స్ పండుగ‌ల‌కు కూడా చీర‌లు పంపిణీ చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు.