మళ్ళీ చెలరేగిన టీ.బీజేపీ అధ్యక్షుడు బండి.. పాతబస్తీపై సంచలన కామెంట్స్.. పోలీసులకు పవర్ ఇవ్వాల్సిందే!

|

Dec 24, 2020 | 4:16 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్ పాతబస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో...

మళ్ళీ చెలరేగిన టీ.బీజేపీ అధ్యక్షుడు బండి.. పాతబస్తీపై సంచలన కామెంట్స్.. పోలీసులకు పవర్ ఇవ్వాల్సిందే!
Follow us on

T.BJP President Bandi Sanjay sensational comments: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్ పాతబస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో వున్న రోహింగ్యాలు, పాకిస్తానీలు బయటికి రావాలంటే ఏం చేయాలో తెలంగాణ సర్కార్‌కు ఉపదేశించారు.

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌లలో సాధించిన సానుకూల ఫలితాలతో ఉత్సాహం మీదున్న కమలనాథులు త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న వరంగల్, ఖమ్మం నగరాలపై దృష్టా సారించారు. ఈ రెండు నగరాల్లో పెద్ద ఎత్తున చేరికలకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ఖమ్మం టీఆర్ఎస్ నేతలు గురువారం బీజేపీ కండువా కప్పుకున్నారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ ఆ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘ ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్లకు చెందిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరనున్నారు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదు..గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలి.. టీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ  బీజేపీ కార్పోరేటర్లకు  అయిదు కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారు..  కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరతామంటోన్నా.. మేమే చేర్చుకోవటంలేదు.. టీఆర్ఎస్ మమల్ని గెలికితే మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటాం.. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారులతో మా నాయకులను ప్రభావితం చేస్తున్నారు.. ’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

‘‘ అధికారం శాశ్వతం కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి.. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలంలో ఐదుగురు మైనర్  బాలికలను ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.. దీనిని బయటకు రాకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారు.. బీజేపీ ఆందోళన చేస్తే ఈరోజు వారికి వైద్య పరీక్షలు చేసి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు.. ఇప్పటికైనా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.. ’’ అని బండి ఆరోపించారు.

‘‘ తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలే .. 15 నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే జల్లెడ పడుతారు.. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలను బయటకు తీస్తారు.. దమ్ముంటే ఓల్డ్ సిటీని పోలీసులకు అప్పగించండి.. ’’ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్ కుమార్.

ఇదీ చదవండి: అగ్రిగోల్డ్‌కు మరో ఝలక్.. మొన్న అరెస్టులు.. ఇపుడు ఆస్తుల జప్తు

ఇదీ చదవండి: జేసీ ఇంటిపై ఎమ్మెల్యే ఫాలోవర్స్ దాడి.. తాడిపత్రిలో ముదిరిన సోషల్ మీడియా వార్

ఇదీ చదవండి: ఫెలో షిప్పుల మంజూరులో అక్రమాలు.. ఓయూ, కేయూలపై హైకోర్టులో పిల్