ఆర్మీ జవాన్ శ్రీనివాస్ కు కన్నీటి వీడ్కోలు

|

Jul 08, 2020 | 7:01 PM

ఉగ్రదాడిలో అమరుడైన ఆర్మీ జవాన్ శ్రీనివాస్ అంత్యక్రియలు అశ్రునయనాల నడుమ ముగిశాయి. శ్రీనివాస్ అంతిమయాత్ర నాగేపెల్లి చేరుకున్నాక, కుటుంబసభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు.

ఆర్మీ జవాన్ శ్రీనివాస్ కు కన్నీటి వీడ్కోలు
Follow us on

ఉగ్రదాడిలో అమరుడైన ఆర్మీ జవాన్ శ్రీనివాస్ అంత్యక్రియలు అశ్రునయనాల నడుమ ముగిశాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపెల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సాలిగం శ్రీనివాస్ రెండు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించారు. బుధవారం పెద్దపల్లికి చేరుకున్న శ్రీనివాస్ పార్థీవదేహాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు నడుమ కమాన్ పూర్ గ్రామం నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. అంతిమ‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీనివాస్ అమ‌ర్ ర‌హే, వందేమాత‌రం, భార‌త్ మాతా కీ జై..అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

15 కిలో మీటర్ల దూరం సాగిన శ్రీనివాస్ అంతిమయాత్ర నాగేపెల్లి చేరుకున్నాక, కుటుంబసభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. 2013లో ఆర్మీలో చేరిన శ్రీనివాస్‌కు రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. జమ్మూలో విధులు నిర్వహిస్తూ అశువులుబాశారు, అండగా ఉండాల్సిన పెద్దకొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కతోచనిస్థితిలో పడింది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.