ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు..

|

Aug 26, 2020 | 6:48 PM

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు..
Follow us on

Bulk Drug Park: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతలతో పాటు ప్రైవేట్ పార్టనర్‌ను గుర్తించాలని ఏపీఐఐసీకి తెలిపింది. అంతేకాకుండా ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్‌లతో నాలెడ్జ్‌ పార్టనర్‌లుగా ఎంవోయూ చేసుకోవాలని ‌ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే తూర్పుగోదావరిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనుండగా.. ఏపీఐఐసీ, ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీబీడీఐసీ) సంయుక్తంగా పనులు చూసుకోనున్నాయి. కాగా, ఈ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న 8 ఏళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు.. దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..