‘రూప్‌’గా అలియా.. అదరగొడుతున్న ఫస్ట్‌లుక్

| Edited By:

Mar 08, 2019 | 11:34 AM

సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ హీరోలుగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘కళంక్’. అభిషేక్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్.. సినిమాలోని ముఖ్య పాత్రాధారులందరి ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్ ధావన్, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్‌ ఫస్ట్‌లుక్‌లు వచ్చి […]

‘రూప్‌’గా అలియా.. అదరగొడుతున్న ఫస్ట్‌లుక్
Follow us on

సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ హీరోలుగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘కళంక్’. అభిషేక్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్.. సినిమాలోని ముఖ్య పాత్రాధారులందరి ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్ ధావన్, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్‌ ఫస్ట్‌లుక్‌లు వచ్చి ఆకట్టుకోగా.. తాజాగా అలియా లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో రూప్‌గా పెళ్లి కుమార్తె గెటప్‌లో అలియా అదుర్స్ అనిపిస్తోంది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.