బీజేపీతో కాంగ్రెస్‌ రహస్య ఒప్పందం- కేజ్రీవాల్‌

|

Mar 05, 2019 | 5:17 PM

న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్‌) తో పోత్తు ఉండదని ప్రకటించిన కాంగ్రెస్‌పై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటుగా స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్‌ సహాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీల అపవిత్ర పొత్తును ఓడించడానికి ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.‘ మోదీ, అమిత్‌ షా ద్వయాన్ని ఓడించాలని దేశం మొత్తం కోరుకుంటున్న సమయంలో బీజేపీ వ్యతిరేక ఓట‍్లను చీల్చడానికి […]

బీజేపీతో కాంగ్రెస్‌ రహస్య ఒప్పందం- కేజ్రీవాల్‌
Follow us on

న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్‌) తో పోత్తు ఉండదని ప్రకటించిన కాంగ్రెస్‌పై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటుగా స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్‌ సహాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీల అపవిత్ర పొత్తును ఓడించడానికి ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.‘ మోదీ, అమిత్‌ షా ద్వయాన్ని ఓడించాలని దేశం మొత్తం కోరుకుంటున్న సమయంలో బీజేపీ వ్యతిరేక ఓట‍్లను చీల్చడానికి కాంగ్రెస్‌ సహకరిస్తోంది. బీజేపీతో కాంగ్రెస్‌ రహస్య ఒప్పందం చేసుకుంది. ఈ అపవిత్ర పొత్తును తిప్పికొట్టేందుకు ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌లను చిత్తుగా ఒడిస్తాం’   అని కేజ్రీవల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.