జయరామ్ హత్య కేసు: నిందితుల కస్టడీ పొడిగింపు

| Edited By:

Feb 16, 2019 | 2:51 PM

హైదరాబాద్: జయరామ్ హత్యకేసులో నిందితుల కస్టడీని మరో ఎనిమిది రోజులు పెంచింది నాంపల్లి కోర్టు. కస్టడీ కింద గత మూడు రోజుల క్రితం నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు పలు విషయాలను రాబట్టారు. అయితే వారి వద్ద నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉండటంతో కస్టడీని పెంచాలంటూ ఇవాళ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు మరో ఎనిమిది రోజులు పెంచుతూ ఈ నెల 23వరకు సమయం ఇచ్చింది. మరోవైపు మూడు […]

జయరామ్ హత్య కేసు: నిందితుల కస్టడీ పొడిగింపు
Follow us on

హైదరాబాద్: జయరామ్ హత్యకేసులో నిందితుల కస్టడీని మరో ఎనిమిది రోజులు పెంచింది నాంపల్లి కోర్టు. కస్టడీ కింద గత మూడు రోజుల క్రితం నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు పలు విషయాలను రాబట్టారు. అయితే వారి వద్ద నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉండటంతో కస్టడీని పెంచాలంటూ ఇవాళ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు మరో ఎనిమిది రోజులు పెంచుతూ ఈ నెల 23వరకు సమయం ఇచ్చింది.

మరోవైపు మూడు రోజుల కస్టడీలో రాకేశ్ రెడ్డి ఎన్నో అక్రమాలు బయటకు వచ్చాయి. పోలీసులు, రౌడీ షీటర్లతో రాకేశ్‌కు ఉన్న సంబంధాలపై మరింత లోతుగా పోలీసులు విచారణ చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. అలాగే ఈ కేసులో అనుమానితుడుగా భావిస్తున్న నటుడు సూర్యను మరోసారి పోలీసులు విచారించనున్నారు. వీటితో పాటు రాకేశ్‌పై గతంలో ఉన్న కేసుల వివరాలను పోలీసులు పరిశీలించనున్నారు.