Bigg Boss 4: ఎలిమినేట్ అవ్వని ‘అమ్మ’.. అంతా నోయల్‌ చలువే

బిగ్‌బాస్‌ 4లో ఈ వారం ఎలిమినేషన్‌లో నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. అమ్మ రాజశేఖర్‌ని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగ్‌ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

Bigg Boss 4: ఎలిమినేట్ అవ్వని అమ్మ.. అంతా నోయల్‌ చలువే

Updated on: Nov 02, 2020 | 6:58 AM

Bigg Boss 4 Amma Rajasekhar: బిగ్‌బాస్‌ 4లో ఈ వారం ఎలిమినేషన్‌లో నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. అమ్మ రాజశేఖర్‌ని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగ్‌ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో బయటకు వచ్చిన మాస్టర్ తన సామాన్లు సర్దుకుంటుండగా.. అందరూ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా హత్తుకున్నారు. వారిని ఓదారుస్తూ బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు అమ్మ. ఇంతలో మాస్టర్ ఆగండి. మీరు కూడా సేఫ్‌ అని నాగార్జున అన్నారు. దీంతో హౌజ్‌లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. ( ప్రధాని మోదీని ఆకట్టుకున్న చిన్నారి పాడిన గేయం)

అయితే ఈసారి అమ్మ రాజశేఖర్ మాస్టర్ సేవ్ అవ్వడానికి నాగార్జున కారణం వెల్లడించారు. అనారోగ్యం కారణంగా మధ్యలో హౌజ్ నుంచి బయటకు వచ్చిన నోయల్‌.. నాగార్జునకు రిక్వెస్ట్ చేశారట. ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయకండి సర్ అని నాగ్‌ని అభ్యర్థించారట. దీంతో అమ్మ సేఫ్‌ అయినట్లు నాగ్‌ తెలిపారు. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లో స్టేజ్‌పైకి వచ్చిన నోయల్‌.. మాస్టర్ తప్పులను ఏకిపారేసిన విషయం తెలిసిందే. దీంతో నోయల్‌ ఓ సైకో అంటూ రాజశేఖర్ మాస్టర్ బాగా ఫైర్ అయ్యారు. అయితే నోయల్‌ చలువతోనే మాస్టర్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడం విశేషం. ( సామూహిక శ్రీ మద్‌ రామాయణ పారాయణ కార్యక్రమంలో పాల్గొనండి…)

Loading...
Unable to load recommendations.
Follow Us