అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ అయిన నటి హేమ స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అందుకు సంబందించిన ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ కాగా.. దాన్ని పరిశీలనగా చూస్తే తమన్నా తనకంటూ పక్కా ప్లాన్‌తో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆమె ఎంట్రీతోనే పాత గొడవలన్నీ బయటికి లాగి కొంతమంది కంటెస్టెంట్లను తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఆ మధ్య వితిక షేరు విషయంలో వరుణ్ సందేశ్ – మహేష్ విట్టా మధ్య గొడవ జరిగింది. దాని గురించి తమన్నా ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో తాను ఉంటే మహేష్‌కు సపోర్ట్ చేస్తానని.. మహేష్‌ను చీప్ క్యారెక్టర్ అనడం తనకు నచ్చలేదని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె బాబా భాస్కర్, జాఫర్, మహేశ్, అలీరెజా, శ్రీముఖిలతో చెప్పగా.. తమన్నా పక్కా స్కెచ్‌తోనే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని ప్రేక్షకులకు భావన కలుగుతోంది.
అటు వరుణ్ సందేశ్ ఈ విషయాన్ని గ్రహించి తమన్నా.. ఓ గేమ్ ప్లాన్‌తోనే వచ్చిందని.. రావడంతోనే మహేష్‌కు తనకు మధ్య గొడవ పెట్టాలని చూస్తోందని రాహుల్‌తో చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తుంటే తమన్నా ఎంట్రీతో హౌస్‌లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా భార్యాభర్తలిద్దరూ కూడా ఎలిమినేషన్ విషయంలో గేమ్ ఆడుతున్నారని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే వారిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకే తాను ఇద్దర్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. ఏది ఏమైనా తమన్నా రాకతో హౌస్‌లో గ్రూప్ రాజకీయాలు మొదలవుతున్నట్లు తెలుస్తోంది.