అలీ గ్రాండ్ రీ ఎంట్రీ.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చే..

| Edited By: Anil kumar poka

Sep 27, 2019 | 8:37 AM

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో బిగ్‌బాస్ 3 విజయవంతంగా కొనసాగుతోంది. అందరూ ఊహించినట్టుగానే తాజా ఎపిసోడ్‌లో అలీ రజా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రేంజ్ బిల్డప్‌తో రష్యన్ భామలతో చిందులేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మాస్క్‌తో బిగ్ బాస్ హౌస్‌కి ఎంట్రీ ఇచ్చిన అలీ రచ్చ చేశాడు. ఎప్పటిలాగే షర్ట్ విప్పి చిందులేస్తుంటే.. శ్రీముఖి అతనికి హగ్ ఇచ్చి సంబరపడిపోయింది. ఇక అలీని తమ్ముడిలా భావించే శివజ్యోతి ఎప్పటిలాగే ట్యాప్ ఓపెన్ […]

అలీ గ్రాండ్ రీ ఎంట్రీ.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చే..
Follow us on

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో బిగ్‌బాస్ 3 విజయవంతంగా కొనసాగుతోంది. అందరూ ఊహించినట్టుగానే తాజా ఎపిసోడ్‌లో అలీ రజా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రేంజ్ బిల్డప్‌తో రష్యన్ భామలతో చిందులేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మాస్క్‌తో బిగ్ బాస్ హౌస్‌కి ఎంట్రీ ఇచ్చిన అలీ రచ్చ చేశాడు. ఎప్పటిలాగే షర్ట్ విప్పి చిందులేస్తుంటే.. శ్రీముఖి అతనికి హగ్ ఇచ్చి సంబరపడిపోయింది. ఇక అలీని తమ్ముడిలా భావించే శివజ్యోతి ఎప్పటిలాగే ట్యాప్ ఓపెన్ చేసేసింది. గుక్కపెట్టి మిస్ యు అలీ అంటూ బోరు బోరున ఏడ్చేసింది. ఊకో అక్కా.. అని అలీ ఎత్తుకుని బుజ్జగించినా కన్నీటి వరద మాత్రం ఆగలేదు. ‘అక్కా.. నేను ఎలిమినేట్ అయ్యా.. చనిపోలేదు’ అంటూ మనపై బయట మీమ్స్ వస్తున్నాయ్’ అని చెప్పి శివజ్యోతిని అలిగేలా చేశాడు అలీ. మొత్తానికి అలీ రీ ఎంట్రీతో ఆట మరింత రంజుగా సాగనుంది.

కాగా అలీ ఎంట్రీకి ముందు వితికా, వరుణ్‌లు తమకు నెగిటివ్‌గా అవ్వడంతో పునర్నవి, రాహుల్ దగ్గర ఫీల్ అవుతుంది. అయితే దానికి రాహుల్ ఇప్పుడే అసలు ఆట మొదలైందని అంటాడు. ఆ తరువాత రవి, శ్రీముఖి, వితికా, వరుణ్‌లు కలిసి గేమ్ ఆడుతుంటారు. గెలిస్తే గెలవనియ్యి.. కెప్టెన్‌ టాస్కే కదా ఆడనియ్యి అంటూ పున్నూతో సర్దిచెప్పాడు రాహుల్. ఆ తరువాత వరుణ్, శ్రీముఖిల గురించి రాహుల్, పునర్నవిల మంచి చర్చ జరుగుతుంది.

ఇక ఇదంతా కాదు మనం గేమ్ ఆడదామా? వద్దా? అని పున్ను అడగడంతో ‘‘నేనైతే ఇక ఆడదల్చుకోలేదు. నేను ఇటుకలు తీస్తే వాళ్లు నలుగురుగా వచ్చి ఆడతారు. మళ్లీ గొడవ మొదలౌతుంది. ఈ రచ్చ ఎందుకు నేను ఆడను. కావాలంటే నువు నన్ను ఎలిమినేట్ చేయి’’ అంటూ తేల్చేశాడు రాహుల్. ‘‘నువు ఆడకపోతే నేను ఒక్కదాన్నే అయిపోతా. ఇద్దరం కలిసి గేమ్ ఆడదాం రా’’ అంటూ రాహుల్‌ని కూల్ చేసి తిరిగి గేమ్ ఆడేలా చేసింది పునర్నవి. అయితే వీళ్లు భయపడినట్టే.. రవి, పునర్నవి, వితికా, వరుణ్‌లు మూకుమ్మడిగా గేమ్ ఆడారు. రాహుల్, పునర్నవిలు రక్షణలో పడ్డారు. ఆ తరువాత జిగేల్ రాణి, టాప్ లేచిపోద్ది సాంగ్‌, ఇంకేం కావాలే పాటలకు వర్షంలో అదిరిపోయే స్టెప్పులు వేశారు. సుమారు 10 నిమిషాలు పాటు సాగిన వర్షంలోని పాటలు, ఆటల ప్రోగ్రామ్‌లో వితికా-వరుణ్, శ్రీముఖి-రవి, పునర్నవి-రాహుల్‌లు పెర్ఫామెన్స్‌తో ఇరగదీసేశారు.

మొత్తంగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీముఖి, రవిలు ఎక్కువ ఇటుకలతో మంచిగా గోడ కట్టడంతో వాళ్లను ఈ గేమ్ విన్నర్‌లుగా ప్రకటించింది శివజ్యోతి. అలాగే ఓవరాల్ గేమ్‌లో శివజ్యోతి అసిస్టెంట్‌గా ఉన్న బాబా బాస్కర్‌ని బెస్ట్ పెర్ఫామర్‌గా ప్రకటించారు. దీంతో రవి, శ్రీముఖి, బాబా బాస్కర్‌, శివజ్యోతిలను ఈ వారం కెప్టెన్‌ పోటీదారులుగా బిగ్‌బాస్ ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా అలీ రీ ఎంట్రీతో హౌస్‌లో మరోసారి రచ్చ మొదలైంది.