బిగ్‌బాస్‌-3 షోపై సంచలన ఆరోపణలు చేసిన హేమ

‘బిగ్‌బాస్ షో’ అంటేనే కాంట్రవర్సీ అయిపోయింది. ఎప్పుడూ కాంట్రవర్సీలతో మీడియాలో నిలుస్తోంది. బిగ్‌బాస్-3 షో స్టార్ట్ చేసినకాన్నుంచీ అడుగడునా ఏదోఒక విమర్శ వినబడుతూనే ఉంది. తాజాగా.. బిగ్‌బాస్-3 షో నుంచి బయటకొచ్చిన నటి హేమ ఆ షోపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే.. చాలామంది హేమ పెద్ద సెలబ్రెటీ కాబట్టి.. తను హౌస్ నుంచి బయటకు వెళ్లదని అనుకున్నా.. ప్రేక్షకులు తీర్పు వేరేలా ఇచ్చారు. బిగ్‌బాస్‌-3 షో నుంచి మొదటి ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా నటి హేమ.. […]

బిగ్‌బాస్‌-3 షోపై సంచలన ఆరోపణలు చేసిన హేమ

Updated on: Jul 29, 2019 | 6:12 PM

‘బిగ్‌బాస్ షో’ అంటేనే కాంట్రవర్సీ అయిపోయింది. ఎప్పుడూ కాంట్రవర్సీలతో మీడియాలో నిలుస్తోంది. బిగ్‌బాస్-3 షో స్టార్ట్ చేసినకాన్నుంచీ అడుగడునా ఏదోఒక విమర్శ వినబడుతూనే ఉంది. తాజాగా.. బిగ్‌బాస్-3 షో నుంచి బయటకొచ్చిన నటి హేమ ఆ షోపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే.. చాలామంది హేమ పెద్ద సెలబ్రెటీ కాబట్టి.. తను హౌస్ నుంచి బయటకు వెళ్లదని అనుకున్నా.. ప్రేక్షకులు తీర్పు వేరేలా ఇచ్చారు.

బిగ్‌బాస్‌-3 షో నుంచి మొదటి ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా నటి హేమ.. హౌస్ నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బయటకు వచ్చిన ఆమె ఆ షోపై తీవ్ర విమర్శలు చేశారు. తనను కావాలనే హాస్‌ నుంచి ఎలిమినేట్ చేశారని ఆరోపించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఒకటి జరిగితే.. బయటకు వేరేలా చూపించారని అన్నారు. నా చేతలు కమాండింగ్‌ అనిపించాయని.. కానీ.. నేను నార్మల్‌గానే చెప్పానని పేర్కొన్నారు. అసలు వంటగది వల్లే హౌస్‌లో గొడవలు వచ్చాయని.. అందరి మంచి గురించి నేను చెప్తే.. నాకే చెడు జరిగిందని తెలిపారు. అక్కా.. అక్కా.. అని పిలుస్తూనే నా వెనుక లేనిపోని మాటలు చెప్పారని వాపోయారు హేమ.

Loading...
Unable to load recommendations.
Follow Us