Big News Big Debate: APలో ఆపరేషన్‌ లోటస్ మొదలైందా? టార్గెట్‌ 2024 ఫార్ములా వర్కవుట్‌ అయ్యేనా?

|

Nov 15, 2021 | 9:18 PM

Big News Big Debate: 2024 ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తోంది AP BJP. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా యాక్షన్‌ ప్లాన్‌ ఉంటుందని.. అంతా సిద్ధం కావాలని కేడర్‌కు దిశానిర్దేశం..

Big News Big Debate: APలో ఆపరేషన్‌ లోటస్ మొదలైందా? టార్గెట్‌ 2024 ఫార్ములా వర్కవుట్‌ అయ్యేనా?
Big News Big Debate
Follow us on

Big News Big Debate: 2024 ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తోంది AP BJP. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా యాక్షన్‌ ప్లాన్‌ ఉంటుందని.. అంతా సిద్ధం కావాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది అధినాయకత్వం. ఆపరేషన్‌ ఆకర్శ్‌ కు ద్వారాలు తెరిచి కొత్త నాయకులతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని అమిత్‌ షా నిర్దేశించారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలకు సమదూరం పాటించాలని అమిత్‌ షా చెప్పారా? పొత్తులపై అంతర్గతంగా కుమ్ములాడుకుంటున్న నేతలకు షా ఇచ్చిన సందేశం ఏంటి.?

పార్టీ నుంచి ఫీడ్‌ బ్యాక్.. స్టేట్‌లో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌ అంటూ కర్తవ్య బోధ చేశారు. ఆపరేషన్‌ లోటస్‌ స్టార్ట్‌ చేసి అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని సూచించారు కేంద్రమంత్రి. సమావేశం అనంతరం త్వరలోనే రాష్ఠ్రానికి చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకుని వచ్చే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు సోము వీర్రాజు. ఆపరేషన్‌ ఆకర్శ్‌తో నేతలను పార్టీలోకి తీసుకుని.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేయాలని అమిత్‌షా స్వయంగా దిశానిర్దేశం చేశారంటున్నారు బీజేపీ చీఫ్‌.

అటు APలో రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించామంటున్నారు సీనియర్లు. పొత్తులు.. ఎత్తులు.. రీసెంట్‌ ఎలక్షన్‌ రిజల్ట్‌ అన్ని అంశాలూ చర్చించామంటోంది కాషాయదళం. రాష్ట్రంలో ప్రజా విద్రోహ పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని దీనిని కూడా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి. త్వరలోనే హైకమాండ్‌ నుంచి డైరక్షన్‌ వస్తుందని.. దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీ నిర్ణయాలు తీసుకుని ఎన్నికల రణక్షేత్రంలోకి వెళతామంటున్నారు.

మొత్తానికి అమిత్‌ షా మీటింగ్‌ తర్వాత ఏపీ బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. బద్వేలులో ఓట్లశాతం పెరిగిందంటున్న పార్టీ 2024లో అధికారమే లక్ష్యమంటోంది. మరి అమిత్‌షా ఇచ్చిన ధైర్యం ఏంటి? జనసేనతో పాటు.. ఇతర పార్టీలతో కూడా పొత్తులపై పార్టీలో భిన్నస్వరాలు వినిపించాయి. ఎవరికి వారే సొంత అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీంతో సహజంగానే కేడర్‌లో అయోమయం ఉంది. మరి అమిత్‌షా టూరుతో పొత్తులపైనా క్లారిటీ వచ్చినట్లేనా.?

 (బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.