భ‌ద్రాద్రి రామయ్య నకిలీ వెబ్‌సైట్..దోచేస్తున్నారు..త‌స్మాత్ జాగ్ర‌త్త‌..

కంత్రీగాళ్లు దోచేస్తున్నారు. అది..ఇది అని తేడా లేదు. ప్ర‌తి వ‌స్తువులోనూ, ప్ర‌తి విష‌యంలోనూ దోపిడి కామ‌న్ అయిపోయింది. అయితే దేవుడిని కూడా దోపిడికి వాడుకోవ‌డం ఇప్పుడు న‌యా ట్రెండ్ అయింది.

భ‌ద్రాద్రి రామయ్య నకిలీ వెబ్‌సైట్..దోచేస్తున్నారు..త‌స్మాత్ జాగ్ర‌త్త‌..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 5:15 PM

కంత్రీగాళ్లు దోచేస్తున్నారు. అది..ఇది అని తేడా లేదు. ప్ర‌తి వ‌స్తువులోనూ, ప్ర‌తి విష‌యంలోనూ దోపిడి కామ‌న్ అయిపోయింది. అయితే దేవుడిని కూడా దోపిడికి వాడుకోవ‌డం ఇప్పుడు న‌యా ట్రెండ్ అయింది. భ‌క్తుల అమాయ‌క‌త్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంద‌రు కేటుగాళ్లు. తాజాగా భద్రాద్రి రాముడి పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి.. పూజల పేరుతో డబ్బులు నొక్కేశారు. అయితే ఓ తెలివైన‌ భక్తుడు ఆ కేటుగాడి తిక్క కుదిర్చాడు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నకిలీ వెబ్‌సైట్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

వరంగల్‌కు చెందిన విజయ్ కుమార్.. భద్రాద్రి దర్శనం చేసుకుందామ‌నుకున్నాడు. అయితే కోవిడ్-19 దృష్ట్యా ఆన్‌లైన్‌లో పూజ చేయిద్దామని భావించాడు. గూగుల్‌లో సెర్చ్ చెయ్య‌గానే ఓ వెబ్ సైట్ ద‌ర్శ‌న‌మిచ్చింది. అది ఆలయానికి సంబంధించినదేనని అనుకొని.. పూజ చేయించాలని నిర్ణ‌యించుకున్నాడు. గూగుల్ పే ద్వారా పూజ కోసం రూ.500 నగదు బ‌దిలీ చేశాడు. క్యాష్ ట్రాన్ఫ‌ర్ అయ్యాక.. స‌ద‌రు అకౌంట్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ జనగామ జిల్లా పాలకుర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కి చెందిన‌దిగా సూచిస్తోంది. దీంతో అత‌డికి అనుమానం వ‌చ్చి..తెలిసిన పోలీసు అధికారిని అప్రోచ్ అయ్యాడు. దీంతో పాల‌కుర్తి పోలీసులు రంగంలోకి దిగారు. మొబైల్ నంబర్ ఆధారంగా ఓ యువకుడు ఈ దందా చేస్తున్న‌ట్టు గుర్తించారు. తనలాగా మరెందరినో అతను మోసం చేశాడని భావించిన విజయ్ కుమార్… విషయాన్ని భద్రాచల ఆలయం ఈవో గదరాజు నర్సింహులు దృష్టికి తీసుకొచ్చాడు. విషయాన్ని ఈవో కూడా ఈ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హించాడు. ఆధారాలతో స‌హా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈవో ఫిర్యాదు మేరకు ఫేక్ వెబ్ సైట్‌పై విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.