
గురు, రాహువులతో సహా అయిదు గ్రహాలు బాగా అనుకూలంగా లాభ స్థానంలో ఉన్నందువల్ల వారం రోజుల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగులకు నూతన ప్రోత్సా హకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. ప్రధానమైన పనులు, ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచ యాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఈ రాశికి దశమ, లాభ, ధన స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల ఏ రంగంలో ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. రావలసిన డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుం టారు. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. విద్యార్థు లకు శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి.
భాగ్య స్థానంలో రాశ్యధిపతి బుధుడితో సహా నాలుగు గ్రహాల యుతి జరిగినందువల్ల విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా దగ్గరవుతారు. నిరుద్యో గులకు శుభవార్తలందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
అష్టమ స్థానంలో గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండడం, వ్యయస్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడ తాయి. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలుంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంటా బయటా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్త వుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగాసాగిపోతాయి.
సప్తమ స్థానంలో రాశ్యధిపతి రవితో సహా నాలుగు గ్రహాలు యుతి చెందడం, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
దశమ స్థానంలో గురువు సంచారం, షష్ట స్థానంలో నాలుగు గ్రహాల యుతి వల్ల ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసు కోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. పెండింగు పనులు సకాలం పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభి స్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి..
ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవ హారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
చతుర్థస్థానంలో నాలుగు గ్రహాల యుతి వల్ల ఆస్తి, ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, నిలకడగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
తృతీయ, సప్తమ స్థానాల్లో శుభ గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగులకు అను కూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా చాలావరకు సానుకూలపడతాయి.
ధన స్థానంలో గ్రహాల బలం ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవ హారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు బాగానే సాగిపోతాయి. రావలసిన సొమ్మును పట్టుదలగా వసూలు చేసుకుంటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. అనుకోకుండా దూరపు బంధువులను కలుసుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది.
ఈ రాశిలో నాలుగు గ్రహాల యుతి, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు.రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కొందరు బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ముఖ్యమైన పనులు వాయిదా పడ తాయి. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగి పోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగంతో సర్దుకుపోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించకపోవచ్చు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
రాశ్యధిపతి అనుకూలంగా ఉండడం వల్ల అనేక విషయాల్లో జీవితం సాఫీగా, సానుకూలంగా సాగి పోతుంది. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండు తుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు తగ్గించుకుంటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది.